కడప జిల్లా రైల్వేకోడూరులోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసి ఆత్మార్పణం చేసుకున్న రోజు సందర్భంగా... ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆర్యవైశ్యులు దేవాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా శాంతి హోమం, శ్రీ కన్యకాపరమేశ్వరి హోమం, నవగ్రహ హోమాలను వైభవంగా నిర్వహించారు. గ్రామోత్సవంలో భాగంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపులో ఆర్యవైశ్య మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం కుంకుమార్చన నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
ఇదీ చదవండి: జిల్లాలో అట్టహాసంగా గణతంత్ర వేడుకలు