కడప జిల్లా పుల్లంపేట మండలం కొండంపల్లి గ్రామంలో 50 కర్ణాటక మద్యం బాటిళ్లను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులకు వచ్చిన సమాచారం మేరకు మండల పరిధిలోని కొండపల్లి గ్రామంలో అక్రమ మద్యం అమ్ముతున్నారని సమాచారంతో తనిఖీలు చేశామని ఎస్ఈబీ సీఐ శివ సాగర్ తెలిపారు.
గ్రామానికి చెందిన సుబ్బ నరసయ్య వద్ద 50 కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుని అతని వద్ద ఉన్న ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. మండల పరిధిలో ఎక్కడైనా అక్రమ మద్యం అమ్ముతున్నట్లు తెలిస్తే ఎస్ఈబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.
కారులో తరలిస్తున్న గంజాయి పట్టివేత..
విశాఖ జిల్లా మాడుగుల మండలం ఘాట్ రోడ్డు కూడలిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రెండు బస్తాల్లోని 20 కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులోని గంజాయిని కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని ఎస్సై రామారావు చెప్పారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి.. రిమాండ్‌కి తరలించామని అన్నారు. కారు సీజ్ చేసి 2 సెల్ఫోన్లు, రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నాటు సారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారుల దాడులు..
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎస్ఈబీ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో నాటు సారా స్థావరాలపై స్పైషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వరుసగా మంగళ, బుధవారాల్లో దాడులు నిర్వహించారు. గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తున్న బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పుల్లలచెరువు మండలం జల్ల వాగు అటవీ ప్రాంతంలో 4500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి.. 20లీటర్ల నాటుసారాను సీజ్ చేశారు. యర్రగొండపాలెం మండలం ఆమనిగుడిపాడు అటవీ ప్రాంతంలో 2100 లీటర్లు, చిన్న కొలుపుల అటవీ ప్రాంతంలో 1400 లీటర్లు బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు మార్కాపురం ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆవులయ్య తెలిపారు.
ఇదీ చదవండి: