ప్రొద్దుటూరు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ
కడప జిల్లా ప్రొద్దుటూరు గ్రామీణ పోలీస్ స్టేషన్‌ని ఎస్పీ అన్బురాజన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను ఆయన పరిశీలించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఫ్యాక్షన్ ప్రాంతాలపై నిఘా పెంచాలని ఆయన సూచించారు. డబ్బు మద్యం పంపిణీ లేకుండా చూడాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. మహిళలపై నమోదైన కేసులను పరిష్కరించాలని సీఐ విశ్వనాథ్ రెడ్డి, ఎస్ఐలు సునీల్ కూమర్ రెడ్డి, కృష్ణయ్యలను ఎస్పీ ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేసిన ఎస్పీ
ఇదీ చూడండి: లక్కీ డిప్ ద్వారా ఇళ్ల స్థలాలా కేటాయింపు