కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో ఉక్కు కార్మాగారం పనులకు మరో ముందడుగు పడింది. ఉక్కు కర్మాగారం భూముల్లో మట్టి పరీక్షలు నిర్వహించనున్నారు. బెంగళూరుకు చెందిన ఐఐఎస్ కు చెందిన అయిదుగురు ప్రతినిధుల బృందం ఉక్కు భూముల్లో పర్యటించారు. సుమారు మూడు నెలల పాటు ఇక్కడే ఉంది భూముల సంబంధించి మట్టి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉక్కు కర్మాగారం కోసం కేటాయించిన మూడు వేల ఎకరాల్లో 200 మీటర్ల దూరంలో మట్టిని సేకరించి పరీక్షించుకున్నారు. ఏ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం చేపట్టాలి, వాటి సామర్థ్యం తదితర వివరాల నివేదికను మెకానిక్ కంపెనీకి అందజేయనున్నారు.
సున్నపురాళ్లపల్లె వద్ద 3,148 ఎకరాల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శిలాఫలకం వేశారు. గత ఏడాది డిసెంబర్ 23న కన్యతీర్థం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిలాఫలకం వేసి ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటేడ్ అని నామకరణం చేశారు.
ఇది చదవండి కడపలో నేడు 6 కరోనా కేసులు... జిల్లాలో మొత్తం 96