బస్సులోకి పాము రావడంతో... ప్రయాణికులు భయాందోళనకు గురైన ఘటన కడపలో జరిగింది. కడప నుంచి ప్రొద్దుటూరుకు బయల్దేరిన ఆర్టీసీ బస్సు... వినాయకనగర్ కూడలి వద్దకు రాగానే రోడ్డుకు అడ్డంగా పాము కనిపించింది. డ్రైవర్ బస్సు ఆపాడు. దీంతో పాము బస్సులోకి చొరబడడింది. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికంగా ఉన్న పాములు పట్టేవారిని పిలిపించి... బస్సులో ఉన్న పామును బయటకి తీయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి... తాత్కాలిక డ్రైవర్ను చితకబాదిన టీఎస్ ఆర్టీసీ కార్మికులు