మహా శివరాత్రి పురస్కరించుకొని రాయచోటిలోని శివాలయాల్లో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు అర్చనలు చేసి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పోటెత్తారు. వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవారు శాలివాహనంపై పురవీధుల్లో విహరించారు. ఆలయ ప్రాంగణంలోనే అఘోర లింగేశ్వర స్వామిని.. సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. బ్రహ్మోత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పాత రాయచోటి, బ్రాహ్మణ వీధి, ఎస్ఎన్ కాలనీ, కొత్తపేటలోని శివ రామాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
శివరాత్రి సందర్భంగా రాయచోటి నుంచి పొలతల, జర్రికోన, గాలివీడులోని గండిమడుగు ఆలయాలకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపారు.
ఇవీ చూడండి...