ETV Bharat / state

విషాదం: పెన్నా నదిలో ఏడుగురు గల్లంతు! - ఏపీ తాజా వార్తలు

స్నేహితుడి తండ్రి కర్మకాండ కార్యక్రమానికి వచ్చిన ఏడుగురు యువకులు నదిలో గల్లంతైన విషాద ఘటన కడప జిల్లా సిద్ధవటంలో జరిగింది. ఇటీవల వర్షాలకు పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీళ్లు చూసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుల్ని నదిలోని ఇసుక మేటలు ఒక్కసారిగా ముంచేశాయి. ఈ ఘటనలో ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

washed out in penna river
washed out in penna river
author img

By

Published : Dec 17, 2020, 10:49 PM IST

విషాదం : పెన్నా నదిలో ఏడుగురు గల్లంతు!

కడప జిల్లా సిద్ధవటం చెందిన రామచంద్ర కుటుంబం చాలా ఏళ్లుగా తిరుపతిలో నివసిస్తున్నారు. ఏడాది కిందట రామచంద్ర చనిపోయారు. ఏడాది కర్మకాండ కార్యక్రమానికి తిరుపతి కుర్లకుంట ప్రాంతం నుంచి రామచంద్ర భార్య, పిల్లలు స్వగ్రామానికి వచ్చారు. వారితో పాటు రామచంద్ర కుమారుడు వెంకట శివకుమార్ స్నేహితులు సిద్ధవటం వచ్చారు. అంతా కలిసి 11 మంది వరకు ఉన్నారు. గురువారం మధ్యాహ్నం కర్మకాండ పూర్తి చేసుకుని భోజనాలు చేశారు. అనంతరం 8 మంది యువకులు దగ్గర్లోని పెన్నా నదిలో ఈతకు వెళ్లారు.

వెంకటశివకుమార్ అనే వ్యక్తిని కొందరు యువకులు నీటిలో ముంచుతూ ఈత కొడుతున్నారు. దీంతో వెంకటశివ కేకలు వేయడంతో బయట ఉన్న నాగూర్ బాషా వచ్చి అతడ్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. మిగిలిన ఏడుగురు అలాగే నడము లోతున్న నీటిలో ఈత కొడుతూ... ఒక్కసారిగా గల్లంతయ్యారు. పెన్నానది లోపల ఇసుక మేటలు ఉన్నాయి. ఇసుక నీళ్లలోకి జారి పోవడంతో ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. వారంతా తిరుపతి చెందిన వారని, డిగ్రీ చదువుతున్నారని పోలీసులు తెలిపారు. జగదీష్, తరుణ్, సతీశ్, షణ్ముఖం, యశ్వంత్, రాజేష్, సోమశేఖర్ అనే యువకులు గల్లంతయ్యారు. పోలీసులకు సమాచారం రావడంతో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రికి రాజేశ్, సోమశేఖర్ మృతదేహాలు వెలికి తీశారు. మిగిలిన ఐదుగురు యువకుల కోసం గాలిస్తున్నారు. వర్షం పడటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. రాజంపేట డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

తిరుపతి నుంచి వచ్చిన 11 మంది యువకుల్లో ఏడుగురు యువకులు పెన్నా నదిలో గల్లంతయ్యారు. నలుగురు సురక్షితంగా ఉన్నారు. వీరిలో ముగ్గురికి ఈత రాకపోవడంతో నదిలో దిగలేదు. ప్రాణాపాయం బయటపడిన వారిలో వెంకటశివ కుమార్, నాగూర్ భాష, అష్రఫ్ వలి, నవీన్ కుమార్ ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వెంకటశివ కుమార్​ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెన్నానది ప్రవాహం ప్రమాదకరంగా ఉందని ముందుగానే హెచ్చరించామని రామచంద్ర కుటుంబ సభ్యులు అంటున్నారు. ఎవర్ని నదిలోకి దిగవద్దని చెప్పినా వినకుండా.. తమకు చెప్పకుండా స్నేహితులంతా వెళ్లి గల్లంతయ్యారని రామచంద్ర భార్య చంద్రకళ ఆవేదన చెందుతున్నారు. ఊరుగాని ఊరు వచ్చి ఇలా గల్లంతవ్వడంతో సిద్ధవటంలో విషాదం అలముకుంది. నదిలోకి దిగే ముందు యువకులంతా కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నారు. దానికి పాటను కూడా జోడించారు. అంతలోనే ఇంతటి విషాదం జరగడం విచారకరమని స్థానికులు అంటున్నారు.

గల్లంతైన ఏడుగురు యువకుల్లో ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా... మిగిలిన ఐదుగురు యువకులు జాడ కోసం శుక్రవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టే వీలుందని తెలుస్తోంది. ఐదుగురు క్షేమంగా ఉంటారా లేదా అనేది ఆందోళన కలిగించే అంశం.

ఇదీ చదవండి : పెన్నా నదిలో ఏడుగురు యువకులు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.