ETV Bharat / state

ఎగువ భద్ర ప్రాజెక్టు విషయంలో మోదీ, జగన్ లు.. సీమకు ద్రోహం చేస్తున్నారు: తులసిరెడ్డి

Tulasi Reddy Fired on Jagan: రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసేలా కర్ణాటక ఎగువ భద్ర ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్నా.. జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారుతుందన్నారు. నికర జలాల కేటాయింపు లేకుండానే కర్ణాటక ప్రభుత్వం 29.5 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్ట్‌ నిర్మిస్తోందని మండిపడ్డారు.

author img

By

Published : Feb 13, 2023, 12:52 PM IST

tulasi reddy
తులసిరెడ్డి

Tulasi Reddy Fired on Jagan: కర్ణాటక నిర్మిస్తున్న ఎగువ భద్ర ప్రాజెక్ట్​తో రాయలసీమ ఎడారి కాక తప్పదనీ.. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే రాయలసీమ ప్రాంతంలోని తుంగభద్ర హై లెవల్ కెనాల్, లో లెవల్ కెనాల్, కేసి కెనాల్ ప్రాజెక్టులు నీరు లేక నిరుపయోగం అవుతాయనీ పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లెలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలో 8 లక్షల ఎకరాల సాగు భూమి బీడు భూమిగా తయారవుతుందనీ.. నికర జలాల కేటాయింపు లేకుండానే కర్ణాటక ప్రభుత్వం 29.5 టీఎంసీల సామర్థ్యంతో 6 లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా ఎగువ భద్ర ప్రాజెక్ట్​ను నిర్మిస్తోందనీ ఆయన తెలిపారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎగువ భద్ర ప్రాజెక్ట్​ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, 2023-24 బడ్జెట్​లో రూ.5,300 కోట్లు కేటాయించిందన్నారు. ఇంత జరుగుతున్నా జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం శోచనీయమన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను, ప్రత్యేకించి రాయలసీమ ప్రయోజనాలను.. మోదీ ప్రభుత్వానికి.. కర్ణాటక ఎన్నికల కోసం జగన్ ప్రభుత్వం పణంగా పెట్టిందని ఆరోపించారు. సీమ పట్ల ఏ మాత్రం ప్రేమ ఉన్నా.. జగన్ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి సమర్థ వాదనలు వినిపించి, కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్ట్​ను ఆపు చేయించాలనీ ఆయన పేర్కొన్నారు. లేకుంటే రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు జగన్ పార్టీనీ చిత్తు చిత్తుగా ఓడిస్తారనీ పీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి అన్నారు.

"కర్ణాటక ప్రభుత్వం, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. రాయలసీమకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు. రాయలసీమకు ప్రధానమైన సాగునీటి వనరు తుంగభద్ర నది. తుంగభద్రలో ఏడాదికి 416 టీఎంసీల నికర జలాలు ఉంటాయని బచావత్ కమిటీ పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వానికి నీటి కేటాయింపులు లేకుండానే 29.5 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మిస్తోంది. దీనిని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి 5300 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది పూర్తయితే రాయలసీమకు నీరు అందదు. ఇంత ప్రమాదం జరుగుతూ ఉంటే.. రాయలసీమ వ్యక్తి అయిన జగన్ మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు". - తులసిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత

కర్ణాటక నిర్మిస్తున్న ఎగువ భద్ర ప్రాజెక్టుపై తులసిరెడ్డి ఆగ్రహం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.