కడప జిల్లా మైదుకూరులో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దువ్వూరు వద్ద జాతీయ రహదారిపై నిర్వహించిన తనిఖీలలో కార్లలో మద్యం గుర్తించినట్లు సీఐ వెంకట్ వివరించారు. 68 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
చాపాడు మండలం గులువలూరు గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, బ్రహ్మంగారి మఠానికి చెందిన సుధాకర్‌రెడ్డిలను అరెస్ట్ చేసినట్లు సీఐ పేర్కొన్నారు. హైదరాబాద్ లో మద్యం కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: