కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. రాఘవరాజపురం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. గ్రామానికి చెందిన ఈశ్వరయ్య అదుపులోకి తీసుకుని ..అతని నుంచి 5 కర్ణాటకకు చెందిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని ఇన్స్పెక్టర్ రామ్మోహన్ తెలిపారు.
కోడూరు నుంచి చిట్వేలు బస్సు మార్గంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. బ్రిడ్జి వద్ద కోడూరు మండలం బయనపల్లికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 8 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కోడూరు మండలం, ఓబులవారిపల్లె మండలం, చిట్వేలు మండల ప్రజల వారని హెచ్చరించారు.
ఇదీ చూడండి. కావలిలో రియల్ మాఫియా...గ్రావెల్ దందా!