ETV Bharat / state

శరవేగంగా నాడు-నేడు పనులు... పనిభారంలో ఉపాధ్యాయులు

author img

By

Published : Jun 13, 2020, 8:47 PM IST

పాఠశాలల రూపు రేఖలు మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన బడి నాడు-నేడు పనులు కడప జిల్లాలో చురుగ్గా సాగుతున్నాయి. నాడు-నేడు పనుల పర్యవేక్షణ బాధ్యత ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. ఇంజినీరింగ్ పనులతో పాటు, రోజువారిగా పనుల పురోగతిని ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేయాల్సి రావడం కష్టంగా మారిందని ఉపాధ్యాయులు చెప్తున్నారు. పనిభారం అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో పర్యవేక్షణ సాగిస్తున్నామని వాపోతున్నారు.

శరవేగంగా నాడు-నేడు పనులు.. పనిభారంలో ఉపాధ్యాయులు

పాఠశాలలు ఆగస్టులో తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. లాక్​డౌన్​, వేసవి విరామంలో కారణంగా బడుల్లో నాడు-నేడు అభివృద్ధి పనులు చేస్తున్నారు. నాడు-నేడు పనులు కడప జిల్లాలో శరవేగంగా జరుగుతున్నాయి. తొలిదశ పనులు జులై 15 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.

కడప జిల్లాలో 1040 ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కింద మరమ్మతులు చేస్తున్నారు. పాఠశాలల్లో తరగతి గదులకు మైనర్, మేజర్ రిపేర్లు, ప్రహరీగోడ, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం వంటి పనులు చేస్తున్నారు. జిల్లాలోని 1040 పాఠశాలల్లో 7409 పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు రూ.195 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 2328 పనులు పురోగతిలో ఉండగా... ఇప్పటివరకు రూ.28 కోట్లు ఖర్చుచేశారు.

నాడు-నేడు పనులు చేస్తున్న పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ సమక్షంలో రోజువారీ పర్యవేక్షణ చేయాల్సిరావడం ఇబ్బందిగా మారిందని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. ఇంజినీర్లు అంచనా వేసిచ్చిన పనులను ఉపాధ్యాయులే... కావాల్సిన మెటిరియల్ దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. స్టీల్, కంకర, ఇతర సామగ్రి కొనుగోలు చేయడంతో పాటు... రోజూ జరిగిన పనులపై ఫొటోలు తీసి... సాయంత్రానికి మన బడి నాడు-నేడు వెబ్​సైట్​లో అప్​లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

అవగాహన లేకపోవడం...

ఈ పనులు తలకు మించిన భారంగా పరిణమిస్తున్నాయని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. సాంకేతికతపై అవగాహన లేని ఉపాధ్యాయులకు.. వివరాలు వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేయడం కష్టంగా మారిందని అంటున్నారు. చాలా మంది ఉపాధ్యాయులు నాడు-నేడు విధుల నుంచి తమను తప్పించాలని ఇటీవల ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు విజ్ఞప్తి చేశారు. జిల్లా అధికారులకు కూడా మొరపెట్టుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యాధికారులు పని ‍ఒత్తిడిలో ఉన్నారన్నారు. కానీ తమ పాఠశాలలు బాగు పడుతాయనే ఆశతో కష్టమైనా నాడు-నేడు పనులు చేస్తున్నామని ఉపాధ్యాయులు అంటున్నారు.

కడపజిల్లాలో జరుగుతున్న నాడు-నేడు పనులను లాక్​డౌన్ సమయంలో ఉపాధ్యాయులతో పాటు విద్యాధికారులు నిత్యం పర్యవేక్షించాల్సి వస్తోంది. పని ఒత్తిడి ఉన్నా విద్యార్థులకు సౌకర్యాలు అందుతాయని ఆలోచించి పర్యవేక్షించాల్సివస్తోందని కడప మండల విద్యాధికారి నారాయణ అన్నారు.

పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గంలోని 171 పాఠశాలల్లో నాడు-నేడు పనులను హెటిరో డ్రగ్స్ సంస్థ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా చేస్తోంది. నాడు-నేడు పనులను ఇతరులకు అప్పగిస్తే తమపై పనిభారం తగ్గుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి : అచ్చెన్న అరెస్టు తర్వాత.. అర్ధరాత్రి నుంచి ఏం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.