ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని కడపలో ఆర్టీసీ కార్మికుల ధర్నా - కడపలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల రిలే నిరాహార దీక్షలు

ఆర్టీసీ విలీనం వద్దంటూ కడప ఆర్టీసీ డిపో వద్ద ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పరిమితి లేని వైద్యం కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

rtc union leaders agitationc
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల రిలే నిరాహార దీక్షలు
author img

By

Published : Feb 11, 2020, 7:20 PM IST

సమస్య పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల ఆందోళన

ప్రయోజనాలు లేని ఆర్టీసీ విలీనం వద్దంటూ కడప ఆర్టీసీ డిపో వద్ద ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. రద్దు చేసిన సౌకర్యాలను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ నాయకులు కుమార్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రద్దు చేసిన ఎస్​ఆర్బీఎస్, ఎస్బీటీ పథకాలు తిరిగి ప్రవేశ పెట్టాలని కోరారు. పరిమితి లేని వైద్యం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక నాయకులంతా, ఏకతాటిపైకి వచ్చి సమస్యలపై పోరాడాలని.. లేకుంటే భవిష్యత్​ అంధకారం అవుతుందని సూచించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటిన చిన్నారులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.