ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: నష్టాల బాటలో ఆర్టీసీ

author img

By

Published : May 11, 2021, 3:17 PM IST

కడప జిల్లా ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లింది. కరోనా కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయి ఈ పరిస్థితి ఎదురవుతోంది. రోజుకు రూ.కోటి వచ్చే ఆదాయం.. ఇప్పుడు కేవలం రూ.10 లక్షలు మాత్రమే వస్తోంది. అధికారులు 30 శాతం బస్సు సర్వీసులను మాత్రమే నడుపుతున్నారు.

rtc loss
rtc loss

కరోనా ఉధ్ధృతికి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కడప జిల్లా ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లింది. రోజుకు కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఆదాయం వస్తుంది. అధికారులు 30 శాతం బస్సు సర్వీసులను మాత్రమే నడుపుతున్నారు. ఇంధన ఖర్చులకు కూడా డబ్బులు రావడంలేదని ఆర్టీసీ అధికారులు గగ్గోలు పెడుతున్నారు.

కరోనా కట్టడిలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. బస్సులు సైతం 12 గంటల వరకే నడవడానికి అవకాశాన్ని కల్పించారు. జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో.. కేవలం 250 బస్సు సర్వీసులను మాత్రమే నడుపుతున్నారు. ఇంతకుముందు జిల్లా వ్యాప్తంగా 8 డిపోల పరిధిలో.. 750 బస్సు సర్వీసులను నడిపేవారు. రోజుకు సుమారు రూ.కోటి ఆదాయం వచ్చేది.

ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల.. రోజుకు 250 బస్సులను మాత్రమే నడుపుతూ.. 30 వేల కిలోమీటర్లు మాత్రమే బస్సులను తిప్పుతున్నారు. ఈ మేరకు రోజుకు 10 లక్షల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తోంది. అనవసరంగా బస్సు సర్వీసులను నడపడం వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని.. అవసరమున్న మేరకు మాత్రమే బస్సులను తిప్పాలని కార్మికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ఈడీఎల్‌ఐ కింద గరిష్ఠంగా రూ. 7 లక్షల చెల్లింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.