ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికులకు ఉన్న సౌకర్యాలను తొలగించటం దారుణం'

ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడం వల్ల తమ సమస్యలన్నీ తీరిపోతాయని భావించామని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జీవీ నరసయ్య అన్నారు. కానీ ప్రభుత్వంలోకి విలీనమయ్యాక ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న విధానంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

రాజంపేటలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల ఆందోళన
రాజంపేటలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల ఆందోళన
author img

By

Published : Jan 24, 2020, 11:32 AM IST

రాజంపేటలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుల ఆందోళన

కడప జిల్లా రాజంపేట ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జీవీ నరసయ్య మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడం వల్ల తమ సమస్యలన్నీ తీరిపోతాయని భావించామన్నారు. కానీ ప్రభుత్వంలోకి విలీనమైన తర్వాత అన్ని సౌకర్యాలను కల్పించాల్సిన యాజమాన్యం ఇప్పుడున్న సౌకర్యాలను తొలగిస్తూ జీవోలు జారీ చేయడం దారుణమన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చే గుర్తింపు కార్డులు, బస్సు పాసులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రతి కార్మికుడి వేతనం నుంచి నెలనెలా రూ.250 కట్ చేసి.... పదవీ విరమణ తర్వాత ఆ మొత్తాన్ని ఫించన్ రూపంలో ఇచ్చేవారన్నారు. ఇప్పుడు ఆ పథకాన్ని రద్దు చేశారన్నారు. ఇలా సౌకర్యాలన్నిటినీ తొలగిస్తూ కార్మికులను అభద్రతాభావంలోకి నెడుతున్నారంటూ వాపోయారు. ఇలాగే కొనసాగితే ఆందోళన తీవ్రం చేస్తామంటూ హెచ్చరించారు.

ఇదీ చూడండి:

ఆర్టీసీ ఉద్యోగులకు ఆ పాస్​లు రద్దు

Intro:Ap_cdp_49_23_VO_rtc vilinam_kaarmikulaku_kotta samasyalu_Av_Ap10043
k.veerachari, 9948047582
ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడం వల్ల మా సమస్యలన్నీ తీరిపోతాయని భావించాం.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు సమకూరుతాయని ఎన్నో కలలు కన్నాం. కానీ ప్రభుత్వంలోకి విలీనమయ్యాక ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న విధానంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.వి.నరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా రాజంపేట ఆర్టీసీ డిపో గ్యారేజ్ ఎదుట ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలోకి విలీనమైన ఆర్టీసీ కార్మికులకు అన్ని సౌకర్యాలను కల్పించాల్సిన యాజమాన్యం ఇప్పుడున్న సౌకర్యాలను తొలగిస్తూ జీవోలు జారీ చేయడం దారుణమన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చే గుర్తింపు కార్డులు, బస్సు పాసులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రతి కార్మికుడి వేతనం నుంచి నెల నెల కట్ చేసే రెండు వందల యాభై రూపాయలు 30 సంవత్సరాల తర్వాత నిలిపివేసి కార్మికుడు పదవి విరమణ తర్వాత దానిని పింఛన్ రూపంలో ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పథకాన్ని కూడా రద్దు చేశారన్నారు. ఇలా ఉన్న సౌకర్యాలన్నీ తొలగిస్తూ కార్మికులను అభద్రతాభావంలోకి నెడుతున్నారని తెలిపారు. ఇలాగే కొనసాగితే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Body:ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం తో కార్మికుల కష్టాలు

Conclusion:ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జీవీ నరసయ్య
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.