డిపో మేనేజర్, స్టేషన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపిస్తూ కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగుల అక్రమ సస్పెండ్లను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. గ్యారేజీలోను ఫిక్స్డ్ చార్ట్ అమలుచేసి.. సహాయకులను నియమించాలన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని... లేదంటే జరగబోయే పరిణామాలకు ఆర్టీసీ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి