మొన్నటి వరకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే బస్సులు ఇప్పుడు సరకులను తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా వైరస్ నివారణలో భాగంగా కడపలో లాక్ డౌన్ కొనసాగుతోంది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ప్రజలకు ఉపయోగపడే నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు తక్కువ ధరకు డిజిటీ లను అద్దెకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు డిజిటీలు ఉన్నాయి. సరకు రవాణా పెరిగేకొద్దీ ఆర్టీసీ బస్సుల్లో ఉన్న సీట్లను తొలగించి వాటిని కూడా సరకు బస్సులుగా వినియోగిస్తామని అధికారులు పేర్కొన్నారు. జిల్లా సరిహద్దులే కాకుండా ఇతర రాష్ట్రాలకు.. వివిధ రకాల కూరగాయలు, నిత్యావసర వస్తువులు, సిమెంట్ బస్తాలు, ఇంటి సామన్లు కూడా తీసుకెళ్లేందుకు అధికారులు బస్సులను సిద్ధం చేశారు.
ఇవీ చదవండి: ఏప్రిల్, మే నెల జీతాలు చెల్లించలేం: స్పైస్‌జెట్