కడపలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ, సీపీఎం, వైకాపా, కాంగ్రెస్, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోని జలాలను వాడుకుంటూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 203ను స్వాగతిస్తున్నట్లు అఖిలపక్షం నాయకులు తెలిపారు. దుర్భిక్షంతో అల్లాడుతున్న రాయలసీమకు సాగునీటి వనరులు కల్పించేందుకు ప్రభుత్వం 203 జీవో తీసుకొచ్చిందని... రాయలసీమ నీటి కోసం రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలుపు తున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. కొందరు నాయకులు మాత్రం తమ స్వార్థ రాజకీయాల కోసం ఆందోళనలు చేస్తున్నారని సమావేశంలో పలువురు అభిప్రాయ పడ్డారు.
ఇదీ చదవండి: జగన్కు వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టు చేస్తారా?: చంద్రబాబు