కడప జిల్లా మైదుకూరులో ప్రొద్దుటూరు బైపాస్ వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కొత్తపల్లికి చెందిన మహబూబ్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన మహబూబ్ హుస్సేన్, అక్రమ్ ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. మైదుకూరులో బంధువుల వివాహ వేడుకలకు హాజరై... తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 108 వాహనం రావడం ఆలస్యం కావడం వల్ల గాయపడిన వారిని ప్రైవేటు వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: