ఏపీ సీఎం తన సొంత నియోజకవర్గమైన పులివెందులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కడప కలెక్టర్ హరికిరణ్ ఎంపీడీవో సమావేశంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్లో సీఎం జగన్ ప్రోగ్రాం ఉందని ఆలోపు అన్ని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరై ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. పులివెందుల, రాయచోటి నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి రూ.1200 కోట్లతో పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. సీఎం జగన్ వచ్చే నెలలో వీటికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే పులివెందులకు ఒక ఇండోర్ స్టేడియం, మార్కెట్ యార్డులు, శీతల గిడ్డంగులను సీఎంచే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అధికారులు త్వరితగతిన పనులు పూర్తిచేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సూచించారు.
ఇదీ చదవండి: