ETV Bharat / state

Kethu Viswanatha Reddy: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.. కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూత - about Kethu Viswanatha Reddy death

Kethu Viswanatha Reddy: ప్రముఖ రచయిత, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.. కేతు విశ్వనాథరెడ్డి ఆనారోగ్యంతో ప్రకాశం జిల్లాలో మృతి చెందాడు. కుమార్తె మాధవి ఇంటికి వచ్చిన ఆయన.. తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించేలోపే కేతు విశ్వనాథరెడ్డి మృతి చెందినట్లు వైద్యుల ధృవీకరించారు. ఈ నెల 24వ తేదీన కేతు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 22, 2023, 7:55 PM IST

Telugu writer Kethu Viswanatha Reddy: ప్రముఖ రచయిత, కవి, కడప జిల్లాకు చెందిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలులో మృతి చెందారు. విశ్వనాధ రెడ్డి మృతిపై సాహితీలోకం కన్నీరుమున్నీరయ్యింది. తన కుమార్తె మాధవి ఇంటికి వచ్చిన ఆయన ఈ రోజు ఉదయం మృతి చెందారు. విశ్వనాథ రెడ్డి భార్యకు అనారోగ్యం కారణంగా ఆసుపత్రి కోసం ఒంగోలు రమేష్‌ సంఘమిత్రలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమెతో పాటు ఒంగోలు వచ్చి, కుమార్తె ఇంటివద్ద ఉన్న విశ్వనాథ రెడ్డి ఈ రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఇదే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించారు. ఆయన మరణ వార్త పలువురని దిగ్భ్రాంతికి గురి చేసింది.

కేతు విశ్వనాథరెడ్డి ప్రస్థానం కడప జిల్లా యర్రగుంట్ల మండలం రంగశాయిపురంలో జులై 10, 1939న కేతు వెంకటరెడ్డి, నాగమ్మ దంపతులకు జన్మించారు. జి.యన్.రెడ్డి పర్యవేక్షణలో కడప జిల్లా ఊర్ల పేరుపై కేతు పరిశోధన చేశారు. 1976లో ప్రచురితమైన ఈ గ్రంథంలో తొమ్మిది అధ్యాయాలున్నాయి. గ్రామ నామ పరిశీలనలో ప్రారంభమై సంజ్ఞా నామతత్త్వాన్ని, స్థల నామ పరిశోధన ప్రయోజనాన్ని వివరించింది. అందులోని చారిత్రక పరిణామాన్ని వివరించారు. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యులు, శాఖాధ్యక్షులుగా పదవీ విరమణ చేశారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు: కేతు విశ్వనాథరెడ్డి రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం (1993), కేంద్ర సాహిత్య అకాడమీ (1986) అవార్డులు లభించాయి. సాహిత్య పరిశోధనకు, సాహిత్యవిమర్శకు సామాజిక శాస్త్రాల సహాయం అనివార్యమని మార్క్సిస్టులు భావిస్తారు. కేతు విశ్వనాథరెడ్డి దృష్టి అనే విమర్శ గ్రంథంలో ఈ సిద్ధాంతాన్నే ప్రతిపాదించి ఈ సిద్ధాంతం ప్రకారమే విమర్శ రాశారు.

తెలుగు సాహిత్య చరిత్రపై: 1980లలో మరొకసారి తెలుగు సాహిత్య చరిత్రలో యుగవిభజన మీద చర్చ జరిగినప్పుడు విశ్వనాథ రెడ్డి కూడా తనదైన విశిష్ట ఆలోచనల్ని అందించారు. తెలుగు సాహిత్య చరిత్రను లిఖిత సాహిత్య చరిత్రగా మాత్రమే భావించడాన్ని వ్యతిరేకించి క్రీ.పూ. 1000వ సంవత్సరం నుంచి క్రీ.పూ. 600వ సంవత్సరం దాకా వ్యవసాయక పూర్వయుగమని, అప్పటి నుంచి క్రీ.శ. 1800 దాకా వ్యవసాయక యుగమని, ఆ తర్వాతది పారిశ్రామిక యుగమని మూడు యుగాలుగా విభజించారు. వాటిలో ఒక్కొక్కదాన్లో ఉపదశలో ప్రాంతీ భేదాలూ, ధోరణులూ ఉన్నాయని, వీటి అవిచ్చిన్నతా చరిత్రే తెలుగు సాహిత్య చరిత్ర అని నిర్ధారించారు.

సవ్యసాచి పత్రిక నిర్వహణ: కేతు విశ్వనాథరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘానికి పూర్వ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన కడప జిల్లాలో సవ్యశాచి పత్రిక నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. అభ్యుదయ రచనలతో పాఠకలోకానికి దిశనిర్ధేశం చేసిన ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. పెద్ద సంఖ్యలో రచనలు చేసి పలువురి మన్ననలు అందుకున్నారు. కేంద్ర సాహితీ అకాడమీ పురష్కారం కూడా అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేసారు. కేతు విశ్వనాథరెడ్డి కుమారుడు విదేశాల్లో ఉంటున్నారు. ఆయన వచ్చిన వెంటనే ఈ నెల 24వ తేదీన కేతు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.