రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కడప జిల్లాలో కoటైన్మెంట్, బఫర్ జోన్లలో మినహా మిగితా ప్రాంతాల్లో ఉదయం 10 గoటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరవడానికి అధికారులు అనుమతించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ కు, వస్త్ర దుకాణాలు, అభరణాలు, పాదరక్షల షాపులకు అనుమతి లేదన్నారు. భారత ప్రభుత్వ సూచనలు, అదేశానుసారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సడలింపులు ప్రకటిస్తూ “లాక్ డౌన్” పై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిబంధనలు, మార్గదర్శకాలు అమలులో ఉoటాయన్నారు.
కoటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన పరిధిలో ఎలాంటి షాపులు తెరవడానికి అనుమతించరు. ఇప్పుడున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇతర ప్రాంతాల్లో ఉదయం 6 గoటల నుంచి 11 గoటల వరకు, కూరగాయలు, పళ్ళు, పాల విక్రయాలు అనుమతిస్తారు. ఉదయం 10 గoటల నుంచి 5 గంటల వరకు నిత్యావసర సరకుల షాపులు తెరవచ్చు.
• మెడికల్ షాపులు మాత్రం ఇప్పటి లాగే 24 గం.ల పాటు అనుమతిస్తారు.
• గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలు, మార్కెట్ సముదాయాలు, వస్త్ర దుకాణాలు, అభరణాలు మరియు పాదరక్షల షాపులను అనుమతించరు.
• పట్టణ ప్రాంతాల్లో ఉన్న నివాస గృహ కాలనీలలో వరుసగా షాపులున్న చోట ఒక షాపు వదిలి మరొక షాపును తెరువవచ్చు. ఈ షాపులను రోజు విడిచి రోజు పద్ధతి (టర్న్ బేసిస్) లోమునిసిపల్ కమీషనర్లు నిర్దేశించిన ప్రకారం తెరవడానికి అనుమతి ఉంది.
మార్గదర్శకాలు తప్పనిసరి
• ప్రతి దుకాణాదారు ప్రతి వ్యక్తికీ, ఆరు అడుగుల దూరం ఉండేలా మార్కింగ్ చేయించాలి.
• దుకాణాల్లో ప్రవేశించినప్పుడు, వెళ్ళేటపుడు శానిటైజర్స్ ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
• దుకాణాల సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలి. వినియోగదారులు తప్పని సరిగా మాస్కులు ధరించాలి.
ఇదీ చదవండి: