కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కార్యక్రమంలో సున్నపురాళ్లపల్లె, పెద్ద దండ్లూరు గ్రామ పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. సున్నపురాళ్లపల్లె, పెద్ద దండ్లూరు గ్రామం మధ్యలో ఉక్కు పరిశ్రమ కోసం 3,148.68 ఎకరాల స్థలాన్ని సేకరించే యోచనలో అధికారులు నిమగ్నమయ్యారు.
88.6 మెగావాట్ల సామర్థ్యంతో..
ఈ పరిశ్రమ పూర్తైతే మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి జరగనుంది. ఉక్కు పరిశ్రమతో పాటు సమీపంలోని 88.6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించనున్నారు.
స్టీల్ కార్పొరేషన్ కోసం..
వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ కోసం రూ.20 వేల 98.56 కోట్ల నిధులు అంచనా వేశారు.
ఇవీ చూడండి : విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన ఘనతే ఆజాద్కే దక్కుతుంది: సీఎం జగన్