కడప జిల్లా ప్రొద్దుటూరు అటవీ శాఖ డివిజన్ పరిధిలో ఎర్రచందనం దుంగలు మాయమైనట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ప్రొద్దుటూరు డీఎఫ్‌వో గురుప్రభాకర్ తేల్చి చెప్పారు. తమ వద్ద నుంచి సరఫరా అయిన ప్రతి ఎర్రచందనం దుంగకు రికార్డు ఉందన్నారు. డివిజన్ పరిధిలో ఉన్న ఎర్రచందనం మొత్తం తిరుపతికి తరలించామన్నారు. 981 టన్నుల నుంచి 1122 మెట్రిక్ టన్నులు ఎర్రచందనాన్ని తిరుపతిలోని గోడౌన్‌కు తరలించామని చెప్పారు. ప్రస్తుతం ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో ఒక్క మొద్దు కూడా లేదని చెప్పారు. తరలించిన ప్రతి దుంగల వివరాలను రికార్డులో పొందుపరచామని తెలిపారు. ఎక్కడా కూడా ఎర్రచందనం అపహరణ కాలేదుని స్పష్టం చేశారు. టన్నుల కొద్దీ దుంగలు అపహరణకు గురైనట్లు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.
ఇదీ చదవండి :