కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం గాదెల అటవీ ప్రాంతంలో మూడు లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలను ఓబులవారిపల్లె పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్నారు.
పక్కా సమాచారంతో తనిఖీలు చేస్తుండగా.. ఐదుగురు ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. వారిలో ఓ వ్యక్తిని పట్టుకోగా.. మిగిలిన వారు పరారయ్యారని చెప్పారు. 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:
కడపలో ఎర్రచందనం స్మగ్లింగ్.. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు