కడప జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు తరలుతున్న ఎర్రచందనం దుంగలను కడప రిమ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజంపేట వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. కడప వైపు వస్తున్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేశారు. 20 లక్షల విలువైన 21 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. చిత్తూరుకు చెందిన నలుగురు వాహనం నుంచి దుంకి వ్యక్తులు పారిపోగా, తమిళనాడుకు చెందిన ఇద్దరు స్మగ్లర్లు పోలీసులకు చిక్కారు. వీరిని ఇళయరాజ, తంగరాజ్లుగా గుర్తించినట్లు డీఎస్పీ సూర్యనారాయణ వివరించారు. కడపలో ఉన్న స్మగ్లర్కు అందజేసేందుకు దుంగలను రవాణా చేస్తున్నట్లు నిందితులు తెలిపారన్నారు. పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: