కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు పోలీసులు సుండుపల్లి మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా రవాణా చేసేందుకు సిద్ధం చేసిన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో రాయచోటి-సుండుపల్లి మార్గంలోని రాచమోల్లపల్లి, ముడుంపాడు వద్ద ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఆటోలో దుంగలను ఎక్కిస్తుండగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇది గమనించిన స్మగ్లర్లు పోలీసులపై రాళ్లతో చేశారు. పోలీసులు చాకచక్యంగా నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: తూర్పుగోదావరి: కిడ్నాపైన బాలిక ఆచూకీ లభ్యం