Red Sandal Smugglers Arrested : నలుగురు అంతర్ జిల్లా ఎర్రచందనం స్మగ్లర్లను వైయస్సార్ జిల్లా ఒంటిమిట్ట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 19 ఎర్రచందనం దుంగలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం మండపం పల్లె అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్మగ్లర్లు పోలీసులను చూసి రాళ్లు, గొడ్డలితో దాడి చేసేందుకు యత్నించి పారిపోతుండగా.. పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం స్మగ్లర్లలో పెంచలయ్యపై ఇదివరకు రెండు ఎర్రచందనం కేసులు ఉన్నాయి. మరో ముగ్గురిపై కూడా ఎర్రచందనం కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.
ఇవీ చదవండి :
- "మా గ్రామానికి ఎమ్మెల్సీ రావొద్దూ".. గడప గడపలో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం
- కొనసాగుతున్న మాండూస్ తీవ్రత.. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు
- ఇకపై శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా?..పేర్ని నానికి పవన్ కౌంటర్