కడప జిల్లా జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా వైరస్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కడప కారాగార అధికారి రవికిరణ్ అన్నారు. కడప కేంద్ర కారాగార అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన... జైలుకు వచ్చే ఖైదీల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశామని తెలిపారు. కారాగారానికి వచ్చే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం నెగిటివ్ వస్తేనే జైల్లోకి అనుమతిస్తామని చెప్పారు.
ఇదీచదవండి. సర్వేయర్‌పై సభాపతి ఆగ్రహం.. కారణం ఇదీ..?