ETV Bharat / state

కడప జిల్లాలో భారీ వర్షం..లోతట్టుప్రాంతాలు జలమయం - Mylavaram Reservoir news

కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానకు లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులకు అధికంగా నీరు చేరుతోంది.

rains in the state
కడపజిల్లాలో భారీ వర్షం.
author img

By

Published : Sep 19, 2020, 6:29 PM IST

rains in the state
మైలవరం జలాశయం
కడప జిల్లాలో కుండపోత వర్షం కారణంగా వంకలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ సంఖ్యలో పంట పొలాలు నీట మునిగాయి . జమ్మలమడుగు నియోజకవర్గంలో జమ్మలమడుగు, మైలవరం, ముద్దునూరు తదితర మండలాల్లో భారీ వర్షం నమోదయింది. గండికోట జలాశయం నుంచి 30 వేల క్యూసెక్కుల నీటిని మైలవరం జలాశయానికి వదిలారు. నదీ పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తలమంచిపట్నం, ముదునూరు, దేవగుడి, తదితర గ్రామాల్లో పంటలు నీట మునిగాయి.

మైలవరం జలాశయం నుంచి 10 గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కుల నీటిని పెన్నా నదికి వదిలారు. లోతట్టు ప్రాంతాలైన వేపరాల, దొమ్మర, నంద్యాల, జమ్మలమడుగు, గొరిగనూరు, దేవగుడి, ప్రొద్దుటూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

rains in the state
రహదారిపై నీరు

కుండపోతగా కురుస్తున్న వర్షాలతో కడప జిల్లా మైదుకూరు ప్రాంతంలో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. ఎర్ర చెరువు వంకతోపాటు.. అనకుంట వంకకు పెద్ద ఎత్తున నీరు చేరడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారితోపాటు వీధుల్లోకి నీరు చేరింది. మోకాలి లోతు నీటి మధ్యనే రాకపోకలు చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని వంకలు ఆక్రమణకు గురయ్యాయి. అందువల్ల నీరంతా రోడ్లపైకి వచ్చి చేరుతోంది.

rains in the state
బైకును పైకి తీస్తున్న ప్రజలు

పులివెందుల నియోజకవర్గంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వంకలు, వాగులు, చెరువులు, పొంగి పొర్లుతున్నాయి. లింగాల మండలం పార్నపల్లి గ్రామంలో వాగులో చిక్కుకున్న ఒక వృద్ధురాలిని పోలీసులు కాపాడారు. నియోజకవర్గంలోని తొండూరు, లింగాల, సింహాద్రిపురం, వేముల, పులివెందుల మండలాల్లో పలు కాలనీలు జలమయమయ్యాయి. తొండూరు మండలంలోని మల్లెల గ్రామంలో చెరువు పొంగి ప్రవహిస్తోంది. ముద్దనూరు - పులివెందుల మార్గంలోని మల్లెల చెరువు వద్ద వంకలు ఉద్ధృతి ఎక్కువ కావడంతో.. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మాచవరం, బిదినంచెర్ల, పైడిపాలెం తదితర గ్రామాల్లో ఆనకట్టలు పొంగి ప్రవహిస్తున్నాయి. తొండూరు మండలం ఇనగలూరు వద్ద మగమూరు వాగు ప్రవహిస్తోంది. గ్రామంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

rains in the state
జలపాతం

కడప జిల్లాలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పాపాగ్ని నది జలకళ సంతరించుకుంది. గత మూడు సంవత్సరాలుగా వర్షాలు లేక వెలవెలబోయిన పాపగ్ని నది... వారం రోజులుగా కరుస్తున్న వర్షానికి పొంగిపొర్లుతోంది. గంగమ్మ గండి పుణ్య క్షేత్రం వరకు నీరు చేరుకోగానే గండి ఆలయ అర్చకులు జలహారతినిచ్చారు. జలపాతం నుంచి నీరు జాలువారుతోంది. వేంపల్లి, వీరన్న గట్టుపల్లి, కుమ్మరాంపల్లె గ్రామ రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. చుట్టు ప్రక్కల ఉన్న పంట పొలాల బోర్లలో నీరు ఏడాది పాటు తగ్గకుండా వస్తాయని గ్రామ ప్రజలు అంటున్నారు...

ఇదీ చూడండి.

'అమరావతిలో ఆ నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.