కడపలో నివర్ తుపాన్ ప్రభావం కారణంగా వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. ఉదయం నుంచి ఆకాశం నల్లటి మేఘాలతో ఉండగా.. మధ్యాహ్నం మూడు గంటల నుంచి వర్షం మొదలైంది. 24 గంటల ముందు నుంచి అధికారులు అప్రమత్తం చేయడంతో ప్రజలందరూ వారి నివాసాలకే పరిమితమయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సన్నద్ధంగా ఉన్నారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఇదీ చూడండి.
నెల్లూరుకు 'నివర్' ఎఫెక్ట్.. ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు