ETV Bharat / state

పులివెందులలో పాడిపరిశ్రమ అభివృద్ధిపై కార్యాచరణ - అమూల్ ఏపీ డైరీ సంస్థ ఒప్పందం

సీఎం జగన్ ఆదేశాల మేరకు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టారు. పాడి పరిశ్రమ ఏర్పాటుపై చర్చించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, అమూల్ సంస్థ ప్రతినిధులు పులివెందులలో సమావేశమయ్యారు. రైతుల నుంచి పాలు సేకరించి అమూల్ సంస్థకు విక్రయించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

పులివెందులలో పాడిపరిశ్రమ అభివృద్ధికి కార్యచరణ

author img

By

Published : Oct 15, 2020, 10:32 PM IST

సీఎం జగన్ ఆదేశాల మేరకు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పాడి పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం అయ్యింది. పరిశ్రమ అభివృద్ధిపై చర్చించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇన్​ఛార్జి కలెక్టర్ గౌతమి, ఏపీ పాల డెయిరీ డెవలప్​మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీ, అమూల్ సంస్థ స్పెషల్ ఆఫీసర్ అహమ్మద్ బాబు, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. పులివెందుల నియోజకవర్గంలో పాడి పరిశ్రమను అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఇన్​ఛార్జి కలెక్టర్ గౌతమి.. అమూల్ సంస్థ ప్రతినిధులతో కూలంకషంగా మాట్లాడారు. అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుని పాడి రైతుల నుంచి పాలు సేకరించి ఆ సంస్థకు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలియజేశారు. పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : ముంపు ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు : కన్నబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.