రైతులపై... స్వయాన భారత ప్రధానమంత్రి అక్రమ కేసులు పెట్టడం దారుణమని కడప సీపీఎం, సీఐటీయు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెప్సీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. గుజరాత్లో రైతులపై పెట్టినవి అక్రమ కేసులని స్పష్టం చేశారు. వాటిని ఎత్తివేయాలని... పెప్సీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుజరాత్ లో రైతులు బంగాళాదుంపలు పండించే లేదనే కారణంతో వారిపై కేసులు బనాయించడం దారుణమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి