కడప జిల్లా ప్రొద్దుటూరులో లాక్‌డౌన్ కొనసాగుతోంది. పోలీసులు ఎక్కడిక్కడికే రహదారులను దిగ్బంధించారు. డీఎస్పీ సుధాకర్ సహా సీఐలు, ఎస్సైలు, సిబ్బంది రోడ్లపైకి వచ్చి వాహనదారులను అడ్డుకున్నారు. అవసరం లేకున్నా బయట తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పట్టణంలో కొందరు యువకులు తిరుగుతుండగా.. వారితో నడి రోడ్డుపైనే గుంజీలు తీయించారు. వాహనాలపై ఎవరూ తిరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని డీఎస్పీ సుధాకర్.. ప్రజలను కోరారు.
ఇదీ చదవండి: