అన్నదమ్ములకు సంబంధించిన భూ విషయంలో కడప జిల్లా ఎర్రగుంట్ల సీఐ సదాశివయ్య జోక్యం చేసుకుని బాధితులపై విచక్షణారహితంగా దాడి చేశాడని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి కడప ఎస్పీకీ ఫిర్యాదు చేశారు. తక్షణం సదాశివయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రొద్దుటూరుకు చెందిన నలుగురు అన్నదమ్ములకు ఎర్రగుంట్ల పరిధిలో స్థలం ఉంది. ఆ స్థలాన్ని అన్నదమ్ములు నాలుగు భాగాలుగా పంచుకోవాలి. కానీ వారిలో ఇరువురు అన్నదమ్ములు సదాశివయ్య వద్దకు వెళ్లగా ఆయన మరో ఇరువురు అన్నదమ్ములను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. నిబంధనల ప్రకారం నలుగురికి న్యాయం చేయాల్సిన సీఐ కేవలం ఇరువురు అన్నదమ్ములకు మాత్రమే న్యాయం చేసి మరో ఇరువురికి అన్యాయం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా సుబ్బారావు అనే వ్యక్తిని బెల్టుతో వీపుపై విచక్షణారహితంగా కొట్టి దాడి చేశాడని ఎమ్మెల్యే చెప్పారు. బాధితులు తనను ఆశ్రయించగా ఈరోజు సీఐ వద్దకు వెళితే అతను చాలా నిర్లక్ష్యంగా మాట్లాడాడని.. కనీసం శాసనసభ్యులు అనే గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడడం ఏంటని ఖండించారు. ఈ విషయంపై డీజీపీ, హోంమంత్రి, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
CM Jagan: గ్రామ, వార్డు సచివాలయాలను అధికారులు తరచూ తనిఖీ చేయాలి: సీఎం
viveka murder case: 51వ రోజు సీబీఐ విచారణ.. వైద్యుల నుంచి కీలక సమాచారం?