కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. కరోనా ఆర్థిక సహాయం 5 వేల రూపాయలకు పెంచాలని డిమాండు చేస్తూ తన ఇంట్లో 48 గంటల దీక్షకు కూర్చున్నారు. కేంద్రం ఇచ్చిన కరోనా ఆర్థిక సహాయం వెయ్యి రూపాయలు మినహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదన్నారు. దిల్లీలో మాదిరిగానే ఇక్కడా కరోనా ఆర్థిక సహాయం 5 వేలు ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు. పేదల కడపు నింపే అన్నా క్యాంటిన్లు తెరవాలన్నారు. కరోనా వ్యాప్తి నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :