ETV Bharat / state

'నూతన నోటిఫికేషన్​లో మమ్మల్ని కొనసాగించండి' - citu protest in kadapa

ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది... మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది కోసం విడుదల చేయనున్న నోటిఫికేషన్​లో ప్రస్తుత సిబ్బందిని కొనసాగించాలని విన్నవించారు.

Primary health center staff handing over the petition
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేత
author img

By

Published : Mar 25, 2021, 6:41 PM IST

పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న తమను నూతన నోటిఫికేషన్​లో కొనసాగించాలని కోరుతూ... రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలోని మంత్రి నివాసంలో వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.

మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో 26 కేంద్రాలు విధులు నిర్వహిస్తుండగా వాటిలో 29 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 49 మంది ఏఎన్ఎంలు, 26 మంది స్టాఫ్ నర్సులు, 22 మంది ఫార్మాసిస్టులు, ఆరుగురు ఫ్రంట్ డెస్క్ ఆపరేటర్లు, 27 మంది ఆయాలు నాలుగున్నరేళ్లుగా విధులు నిర్వహిస్తున్నట్టు యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పి.మణి వివరించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది కోసం విడుదల చేయనున్న నోటిఫికేషన్​లో ప్రస్తుత సిబ్బందిని కొనసాగించాలని మంత్రికి విన్నవించారు.

కడపలో...

అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించబోమని చెప్పిన జగన్ మోహన్​ రెడ్డి అధికారంలోకి వచ్చాక అర్బన్ హెల్త్ సెంటర్ లలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని తొలగించడం దారుణమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. విధుల్లోకి తీసుకోకుంటే దశల వారీగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

వంగపండు కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.