ETV Bharat / state

సంక్రాంతి సంబరాలు.. అంబరాన్నంటాయి... - bjp women wing sankranti celebrations in kadapa

కడప రవీంద్రనగర్​లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు, యువత ఉల్లాసంగా పాల్గొన్నారు. నగరంలో పండగ వాతావరణం నెలకొంది. పెద్దలు ఒక్కసారిగా పిల్లలుగా మారి ఆటపాటల్లో పాల్గొన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ కార్యక్రమం జరిగింది.

pre sankranti event
సంక్రాంతి సంబరాలు
author img

By

Published : Jan 10, 2021, 10:01 PM IST

సంక్రాంతి పండుగకు మరో రెండు రోజులు ఉండగానే కడపలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. కడప రవీంద్ర నగర్​లో భాజపా ఆధ్వర్యంలో మండల కమిటీ మహిళా సభ్యులు పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి అందరూ ఉల్లాసంగా సంబరాల్లో పాల్గొన్నారు. నిజంగా సంక్రాంతి పండుగ ఈ రోజే అన్నట్టుగా ఆనందంగా గడిపారు.

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

మహిళలు, యువత, చిన్నారులు వారి వారి శైలిలో నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. కొన్ని పోటీలు నిర్వహించాక ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలు, యువకులు ఉట్టి కొట్టేందుకు పోటీపడ్డారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వరుస కార్యక్రమాలతో అందరూ సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు. పాత సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని.. కొత్త సంవత్సరంలో చాలా ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించామని నిర్వాహకులు బండి ప్రభాకర్ అన్నారు.

ఇదీ చదవండి: సీఎం జగన్​కే మాల మహానాడు మద్దతు: కారెం శివాజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.