కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలోని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ దర్శనాన్ని.. సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నిలిపివేశారు. ఆలయ పూజారుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మఠం మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో చర్చించిన తర్వాతే.. వారి ఆదేశాల మేరకు ఆలయం మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు గమనించి దర్శనానికి రావద్దని కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదు