తాను కలెక్టర్ సమావేశానికి వెళ్లడం కారణంగా అభ్యంతరాల దరఖాస్తులను చూడలేదని, వాటిని పరిశీలించి చెబుతానని పురపాలక కమిషనర్ రాజశేఖర్ తెలిపారు. ఈ సమాధానంపై తెదేపా, వామపక్షాలు, జనసేన నాయకులు అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓట్ల కేటాయింపు విషయంలో అవకతవకలు జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెంగల్రాయుడు తెలిపారు. రాజకీయ పార్టీల సమావేశం పెట్టి సరైన సమాచారం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి తెదేపా, వామపక్ష, జనసేన నాయకులు వెళ్లిపోయారు.
ఇవీ చదవండి: మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణుల ర్యాలీ