ప్రజలు కరోనాతో అల్లాడుతున్న వేళ... కడప జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధులు గుర్రపుస్వారీ చేయడం విమర్శలకు తావిచ్చింది. కడప జిల్లా రాజంపేట మండలం ఆకేపాడులో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబులు సమావేశమైన సందర్భంలో ఇది జరిగింది. ఆకేపాడులో సమావేశమైన నేతలు జిల్లాలో కరోనా తీవ్రతపై చర్చించారు.
ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్నో చర్యలు చేపడుతుందని నేతలు తెలిపారు. కానీ.. ప్రజల్లో చైతన్యం లేకపోవడం వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రజలు మాస్కులు ధరించి, శానిటైజర్ ఉపయోగిస్తూ.. సామాజిక దూరం పాటించడం వల్లే కరోనా నియంత్రణ సాధ్యమన్నారు. ప్రజల్లో చైతన్యంతోనే కరోనా కట్టడి జరుగుతుందని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు. అంతవరకూ బాగానే ఉంది...కానీ ఆ తర్వాత నేతలు.. ఆటవిడుపుగా గుర్రపుస్వారీ చేయడం విమర్శలకు తావిచ్చింది. కడప మేయర్ సురేష్ బాబు, విప్ కోరుముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి చెయ్యేరు నదిలో గుర్రపుస్వారీ చేశారు.
ఇదీ చదవండి: