సార్వత్రిక ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. కడప జిల్లా అట్లూరు చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో 10 లక్షల 40వేల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. కడప నుంచి కలసపాడుకు ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న నగదును జనార్దన్ అనే వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు సంబంధించిన ఆధారాలు అతను చూపించలేదు. దాంతో ప్రత్యేక వాహనంలో బద్వేలుకు తీసుకువచ్చి ఆర్.ఓ. రామచంద్రారెడ్డికి అప్పజెప్పారు. ఈ చెక్పోస్ట్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడం ఇదే ప్రథమం.
ఇవీ చదవండి..