లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 800 కేసులు నమోదు చేసినట్లు కడప డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు. ఎవరైనా మాస్కులు, గ్లౌజులు లేకుండా బయటకు వస్తే..కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
మోటార్ వెహికల్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 13 వేల770 కేసులు నమోదు చేసి 62 లక్షల రూపాయల జరిమానా విధించామని తెలిపారు. బుధవారం నుంచి దాడులు మరింత ముమ్మరం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి