ETV Bharat / state

Arrest: యువతి హత్య కేసు: ప్రేమోన్మాది చరణ్ అరెస్ట్ - crime news

కడపజిల్లా చింతలచెరువులో యువతిని కిరాతకంగా గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది చరణ్​ను పోలీసులు అరెస్ట్(arrest) చేశారు. అతడితి సహకరించిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. మహిళలపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ తెలిపారు.

accused in murder of a girl was arrested at kadapa
యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది చరణ్ అరెస్ట్
author img

By

Published : Jun 19, 2021, 5:03 PM IST

Updated : Jun 19, 2021, 5:20 PM IST

కడప జిల్లా బద్వేలు మండలం చింతలచెరువులో నిన్న సాయంత్రం యువతిని గొంతుకోసి హత్య చేసిన ప్రేమోన్మాది చరణ్ అనే వ్యక్తిని అరెస్ట్(arrest) చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. గత కొంతకాలంగా ప్రేమించాలని వేధిస్తూ.. యువతి వెంట పడుతున్నాడని, నిన్న తల్లిదండ్రులతో పొలంలో పనిచేస్తున్న యువతి శిరీషపై నిందితుడు ఒక్కసారిగా కత్తితో దాడి చేసి గొంతుకోశాడని ఎస్పీ పేర్కొన్నారు.

యువతిపై దాడి తరువాత ఘటనాస్థలి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తుండగా.. నిందితుడు చరణ్​కు మరో ఇద్దరు యువకులు సహకరించినట్లు తేలిందని ఎస్పీ వెల్లడించారు. వారిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు ఆయన తెలిపారు.

జిల్లాలో ఎక్కడైనా మహిళలు, అమ్మాయిలను ఎవరైనా వేధిస్తున్నట్లు తేలితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచడంతోపాటు నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. హింసను ప్రేరేపించే విధంగా ఎవరైనా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

Rahul Gandhi: 'పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టంలేదు'

రేపు మెగా వ్యాక్సినేషన్.. 10 లక్షల టీకా డోసులు

Last Updated : Jun 19, 2021, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.