పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప జిల్లా రాయచోటిలో పోలీసులు ఐక్యతా పరుగును నిర్వహించారు. జాతీయ రహదారిపై ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పులివెందుల డీఎస్పీ వాసుదేవన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అధికారులు, సిబ్బంది సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని శివాలయం కూడలి, ఎస్ఎన్ కాలనీ, నేతాజీ కూడలి వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది పరుగును సాగించారు. నేతాజీ కూడలిలో మానవహారంగా ఏర్పడి అమరవీరులకు నివాళులు అర్పించారు.
ఇవీ చూడండి...