ETV Bharat / state

మాస్కులు లేని వారికి పోలీసుల జరిమానా

కరోనా మనకు సోకదులే అని ఒకరు... నేను మాస్కు వేసుకోకపోతే నష్టం లేదని మరొకరు.. ఇలా ఎవరికి ఎవరు నాకు కరోనా రాదు అనే భ్రమతో మాస్కుల్లేకుండా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. మరి కొందరైతే మాస్కు మెడకు వేసుకొని... అలంకారప్రాయంగా ఉంచుకుంటున్నారు. ఇటువంటి వారిపై కడప పోలీసులు జరిమానా కొరడా ఝుళిపించారు. ఒక్కరోజులోనే వచ్చిన ఎంత జరిమానా విధించారో తెలుసా?

police fine for not wearing mask
నిబంధనలు పాటించని వారిపై పోలీసుల చర్యలు
author img

By

Published : Jun 16, 2020, 12:47 PM IST

కడపలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నా... కొంత మంది బాధ్యతారాహిత్యంగా మాస్కులు ధరించటం లేదు. అటువంటి వారిపై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్​ల పరిధిలో మాస్కు లేకుండా రహదారులపైకి వచ్చిన వారికి జరిమానాలు విధించారు. సుమారు సోమవారం ఒక్కరోజే 494 కేసులు నమోదు చేసి... 1,08,620 రూపాయల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వెల్లడించారు.

కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని అన్బురాజన్ పిలుపునిచ్చారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. కొంతమంది అలంకార ప్రాయంగా మాస్కును వాడుతున్నారనీ... అది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమేనని హెచ్చరించారు.

'మీ ఆరోగ్య మీ చేతుల్లోనే ఉంది. తప్పనిసరిగా మాస్కులు ధరించారి. ఎదుట వారితో మాట్లాడేటప్పుడు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాం' - ఎస్పీ అన్బురాజన్

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి: కొండపై గుహలో పిల్లలు.. శ్రమించి రక్షించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.