ఈ నెల 18న కడప జిల్లా రామాపురం వద్ద.... ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. తమిళనాడుకు చెందిన వినోద్‌కుమార్‌ను.... వెంకటేశన్ వినోద్.... మరో నలుగురితో కలిసి.... 16న కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
అతడిని 17న హత్య చేసి..... 18న రామాపురం వద్ద మృతదేహాన్ని పడేసినట్టు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. సాంకేతిక ఆధారాలతో కేసు దర్యాప్తు పూర్తి చేశామన్నారు. ప్రధాన నిందితుడు వెంకటేశన్ వినోద్‌ను అరెస్ట్ చేశామన్న ఆయన.... మరో నలుగురు తమిళనాడు కోర్టులో లొంగిపోయారని.... వారినీ పీటీ వారంట్ కింద అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి: