పులివెందులకు చెందిన వెంకట చలపతి నాలుగేళ్ల కిందట భార్య పిల్లలను వదిలేసి కడపకు వచ్చి ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా సమయానికి భోజనం లేక అనారోగ్యం పాలయ్యాడు. నాలుగైదు రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వడదెబ్బకు గురై మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి విషయాన్ని పులివెందులలో ఉన్న భార్యాపిల్లలకు తెలియజేశారు. మృతదేహాన్ని పులివెందులకు తీసుకెళ్లే ఆర్థిక స్తోమత లేక కడపలోనే ఖననం చేయాలని పోలీసులను కోరారు. ఈ మేరకు పోలీసులు మేము సైతం స్వచ్ఛంద సంస్థ వారికి మృతదేహాన్ని అప్పగించారు. వారు అంత్యక్రియలు నిర్వహించారు.
వడదెబ్బతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి - cadapa dst sustrok news
ఉపాధి కోసం కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలేసి పులివెందులకు చెందిన ఓ వ్యక్తి కడపలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి... అనేక ఇబ్బందులు పడ్డాడు. ఆనారోగ్యం పాలయ్యాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక వడదెబ్బకు గురై చనిపోయాడు.