ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో పురపాలిక అధికారులు ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని పురపాలక కార్యాలయం నుంచి నాలుగురోడ్ల కూడలి వరకు ప్రదర్శన సాగింది. పురపాలక ఛైర్మన్ మాచనూరు చంద్రతోపాటు కమిషనర్ పీవీ రామకృష్ణ, ఏఈ మధుసూధన్బాబు, పురపాలిక సిబ్బంది, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రతినిధులు ప్రదర్శనలో పాల్గొన్నారు. జలం లేనిదే.. జీవం లేదని.. నీటిని పొదుపు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండీ: