జనతా కర్ఫ్యూ సందర్భంగా నిన్న నిర్మానుష్యంగా మారిన రైల్వేకోడూరు పట్టణంలో ఈరోజు దుకాణాలు, హోటళ్లు తెరుచుకున్నాయి. నిత్యావసర సరుకులు కొనుగోలుకు ప్రజలు భారీగా పట్టణానికి వస్తున్నారు. పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే గానీ జన సమూహాలను కట్టడి చేయడం అసాధ్యమని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదని, దుకాణాలను మూసివేయాలని సూచించారు శిక్షణా డీఎస్పీ ప్రసాదరావు అన్నారు. వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ను తరిమికొట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి.