కడప జిల్లా మోరగుడిలో మురుగు కష్టాలు వెంటాడుతున్నాయి. కొద్దిపాటి వర్షానికి ఆ ప్రాంతం జలమయం అవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామం అంతా వరద ప్రవాహంలో చిక్కుకుంది. నిలిచిపోయిన నీరంతా బురద గుంటలా తయారై జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. వర్షపు నీరు వెళ్లేందుకు దారి లేని కారణంగా.. చాలా ఏళ్లుగా పరిస్థితి ఇలాగే ఉంటోందని స్థానికులు తెలిపారు. కాలువలు లేని చోట ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఇదీ చదవండి: